Karate Kalyani: రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లను రేవు పెట్టేయాలి: కరాటే కల్యాణి

Actress Karate Kalyani Fires On Hema

  • మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి హేమను తప్పిస్తామని వెల్లడి
  • తప్పు చేస్తే ఆడ, మగ తేడా చూడబోమన్న కరాటే కల్యాణి
  • ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలితో కలిసి వెళ్లాలంటూ హితవు

రేవ్ పార్టీలు పెట్టే వారిని, వాటిలో పాల్గొనే వారిని రేవు పెట్టి ఉతికేయాలని కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొందనే విషయంపై కల్యాణి స్పందించారు. హేమ ఆ పార్టీలో పాల్గొందని తేలితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఒకటేనని, వదిలిపెట్టేదిలేదని తేల్చిచెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, దానికి ఫలితం అనుభవించాల్సిందేనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా కరాటే కల్యాణి చెప్పుకొచ్చారు.

పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారిపై కల్యాణి మండిపడ్డారు. ఈ పార్టీల వల్ల ఒక్కరు తప్పుచేసినా మొత్తం ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని, మన సంస్కృతి నాశనం అవుతోందని కల్యాణి వాపోయారు. రూ.50 లక్షలు పెట్టి రేవ్ పార్టీలు చేసుకోవడం అవసరమా అని ప్రశ్నించారు. ఎంజాయ్ చేయాలనుకుంటే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి రావాలని సూచించారు. హేమను ఎవరూ ఇరికించలేదని, నోటి దురుసుతనమే ఆమెకు శత్రువని కల్యాణి చెప్పారు. ‘హేమక్కా ఇలా అయిపోయావేంటి.. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఈ కేసు నుంచి నువ్వు తొందరగా బయటపడాలని కోరుకుంటున్నా’ అంటూ కల్యాణి వ్యాఖ్యానించారు.

More Telugu News