Andhra Pradesh: పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం.. వీడియో వైర‌ల్!

Psycho Siva in Krishna District of AP

  • ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘ‌ట‌న‌
  • మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగిన సైకో శివ‌
  • చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వైనం
  • శివ‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో సైకో శివ మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు.

కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన శివ.. మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని చల్లపల్లిలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్‌చ‌ల్‌ చేశాడు. ఈ క్ర‌మంలో శివను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం తీవ్ర‌ గాయాలతో ఉన్న శివను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 


Andhra Pradesh
Psycho Siva
Krishna District
Viral Videos

More Telugu News