Ch Malla Reddy: ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతా: భూ వివాదంపై మల్లారెడ్డి స్పందన

Mallareddy talks about land dispute

  • మేడ్చల్ జిల్లా సుచిత్రలోని భూమిపై వివాదం
  • మాదంటే మాదంటున్న మల్లారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్
  • తనకు రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఖరారైందన్న మల్లారెడ్డి
  • తన వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని వెల్లడి

మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని తన భూమిని కబ్జా చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వ సర్వే కూడా ముగిసింది. అయినప్పటికీ, మాజీ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సర్వే నెంబరు.82లోని 2.5 ఎకరాల భూమి మాదంటే మాదని ఇరువురు వాదిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, మల్లారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో స్పందించారు. తనకు రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఖరారైందని, ఈ భూమి వ్యవహారాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని, ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాలతో తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. 

సుచిత్రలోని భూమికి సంబంధించి తన వద్ద ఒరిజినల్ పత్రాలు ఉన్నాయని, ఆ డాక్యుమెంట్లు ఫేక్ అని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అలాగే లక్ష్మణ్ వద్ద ఉన్న పత్రాలు సరైనవని నిరూపించలేకపోతే ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని మల్లారెడ్డి సవాల్ విసిరారు.

Ch Malla Reddy
Adluri Lakshman
Land
Suchitra
BRS
Congress
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News