Dhulipala Narendra Kumar: ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలు, ప్రజా సాక్ష్యాలు ఉన్నాయి: ధూళిపాళ్ల

Dhulipalla comments on Palnadu violence

  • ఏపీలో మే 13న పోలింగ్
  • పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో హింస, ఉద్రిక్తతలు
  • ప్రశాంతంగా ఉన్న పల్నాడును వైసీపీ నేతలు వల్లకాడు చేశారన్న ధూళిపాళ్ల
  • ఓటమి భయంతోనే విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు

ఏపీలో పోలింగ్ నాడు, అనంతరం జరిగిన హింసపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పందించారు. అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోందని అన్నారు. 

టీడీపీ నేతలే తమపై దాడి చేశారని వైసీపీ నేతలు అంటున్నారని... ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలు, ప్రజా సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కొందరు పోలీసులు వైసీపీతో కుమ్మక్కై టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. 

ప్రశాంతంగా ఉన్న పల్నాడును వైసీపీ నేతలు వల్లకాడు చేశారని ధూళిపాళ్ల మండిపడ్డారు. అధికారం కోల్పోతున్నామనే అక్కసుతో దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలవాలని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఓటమి భయంతో విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

Dhulipala Narendra Kumar
Palnadu District
Poll Violence
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News