Manchu Manoj: 'మిరాయ్' నుంచి మంచు మ‌నోజ్ గ్లింప్స్ వ‌చ్చేసింది!

The BlackSword GLIMPSE of Manchu Manoj from Mirai

  • తేజా స‌జ్జ, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబోలో 'మిరాయ్'
  • ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో మంచు మ‌నోజ్‌
  • నేడు మ‌నోజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గ్లింప్స్ విడుద‌ల చేసిన మేక‌ర్స్‌
  • ఆక‌ట్టుకుంటున్న మంచువార‌బ్బాయి వారియ‌ర్ లుక్‌

హ‌నుమాన్ త‌ర్వాత టాలీవుడ్‌ యంగ్ హీరో తేజా స‌జ్జ నుంచి వ‌స్తున్న చిత్రం మిరాయ్. ది సూప‌ర్ యోధ అనేది ఉప శీర్షిక‌. ఈ మూవీలో మంచు మ‌నోజ్ నెగెటివ్ రోల్‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. సోమ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌నోజ్ పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రం యూనిట్ విడుద‌ల చేసింది. బ్లాక్ స్వాడ్ అనే ఓ క‌త్తి గురించి వివ‌రిస్తూ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో సాగిన గ్లింప్స్ ఆక‌ట్టుకుంటోంది. ఈ సూప‌ర్ ఫ్యాంట‌సీ మూవీకి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

More Telugu News