Hema: 'బెంగళూరు రేవ్ పార్టీతో నాకేం సంబంధంలేదు' అంటున్న హేమ.. వీడియో ఇదిగో!

Telugu Actress Hema Clarification About Bengalore Rave Party

  • హైదరాబాద్ లోనే ఓ ఫాంహౌస్ లో చిల్ అవుతున్నానంటూ వీడియో రిలీజ్ చేసిన నటి
  • కన్నడ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని కోరిన హేమ
  • రేవ్ పార్టీలో ఎవరున్నారనేది తనకు తెలియదని వ్యాఖ్య

బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధంలేదని సినీ నటి హేమ వివరణ ఇచ్చారు. ఆ పార్టీలో తాను కూడా ఉన్నట్లు కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేయడాన్ని ఖండించారు. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోని ఓ ఫాంహౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పారు. ఆ పార్టీలో ఎవరు ఉన్నారో తనకు తెలియదని చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియాలో హేమ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 

బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో దాదాపు వందమందికి పైగా పట్టుబడ్డారని, అందులో తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారని సమాచారం. ఇందులో నటి హేమ కూడా ఉందంటూ కన్నడ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని నటి హేమ వివరణ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

More Telugu News