spain: చీకటిని చీల్చుకుంటూ ఆకాశం నుంచి దూసుకొచ్చిన నీలి కాంతి తరంగం!

Viral videos show blue meteor lighting up sky over Spain Portugal

  • ఒక్క క్షణంపాటు చిమ్మచీకటి కాస్తా పట్ట పగలులాగా మార్చిన వైనం
  • స్పెయిన్, పోర్చుగల్ గగనతలంపై అరుదైన దృశ్యం ఆవిష్కరణ
  • ఆశ్చర్యపోయిన ప్రజలు.. భారీ ఉల్కగా అనుమానం.. నెట్టింట వీడియో వైరల్

యూరొప్ లోని స్పెయిన్‌, పోర్చుగల్‌ గగనతలంపై అరుదైన దృశ్యం కనిపించింది. చీకటిని చీల్చుకుంటూ ఆకాశంలో భారీ నీలి రంగు కాంతి తరంగం దూసుకెళ్లింది. దాని కాంతి తీవ్రత రాత్రిని కాస్తా ఒక్క క్షణంపాటు పగలులా మార్చేసింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలంతా అవాక్కయ్యారు. వెంటనే ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్ గా మారింది. 

అది ఒక భారీ ఉల్క అయ్యుంటుందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంపాటు కాంతి రేఖ కనిపించినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఆ వెలుగు రేఖ ఉల్కాపాతమా కాదా? అది ఎక్కడ నుంచి వచ్చింది, ఎక్కడ పడింది అనే విషయాలపై అంతరిక్ష సంస్థలు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అది భారీ ఉల్కేనని.. క్యాస్ట్రో డైరో అనే ప్రాంతంలో పడిందనే ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News