Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ వ్యక్తి అకౌంట్లో అకస్మాత్తుగా రూ.9,900 కోట్లు!

UP man gets Rs 9900 crore credited into his bank account
  • బదోహీ జిల్లాలో ఘటన
  • కస్టమర్‌కు చెందిన కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ ఎన్‌పీఏగా మారిన వైనం
  • అకౌంట్‌పై ఎన్‌ఫీఏ సంబంధిత ఆంక్షలు విధింపు
  • ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అకౌంట్‌లో భారీ మొత్తం కనిపించిన వైనం
  • దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని, అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టామన్న మేనేజర్
అకస్మాత్తుగా తన అకౌంట్లో సుమారు రూ.9,900 కోట్లు కనిపించడంతో ఓ వ్యక్తి దిమ్మెరపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. భాను ప్రకాశ్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అయితే, బ్యాంకు దృష్టిలో ఈ అకౌంట్ ఎన్‌పీఏగా (నిరర్థక ఆస్తి) మారింది. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అతడి అకౌంట్లో ఒక్కసారిగా రూ. 99,99,94,95,999.99 దర్శనమిచ్చాయి. దీంతో, షాకైన భాను ప్రకాశ్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బ్యాంకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 

‘‘సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అకౌంట్‌లో అంత మొత్తం కనిపించిందని భాను ప్రకాశ్‌కు మేము వివరించాము. పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నాము. అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందుజాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్‌లో పెట్టాము’’ అని బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు. 

‘‘ఎన్‌పీఏలకు సంబంధించిన అకౌంట్లపై కొన్ని పరిమితలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాము. భాన్ ప్రకాశ్ తన అకౌంట్ చెక్ చేసినప్పుడు అది ఎన్‌పీఏ ఆంక్షల కారణంగా నెగెటివ్‌లో కనిపించింది. పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము’’ అని ఆయన తెలిపారు.
Uttar Pradesh
Bank Account
Software Glitch
Rs 9900 crore in Account

More Telugu News