KU: కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

Government orders to vigilance enquiry on KU VC

  • యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా అధ్యాపకుల తొలగింపు
  • అక్రమ బదిలీలు, పీహెచ్‌డీ అడ్మిషన్ ప్రక్రియలో అక్రమాలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ
  • యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నా వీసీ పట్టించుకోలేదని ఆరోపణలు

కాకతీయ యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా అధ్యాపకుల తొలగింపు, అక్రమ బదిలీలు, పీహెచ్‌డీ అడ్మిషన్ ప్రక్రియలో అక్రమాలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ టీ.రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. విశ్వవిద్యాలయం భూములు అన్యాక్రాంతమవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 

వీసీ రమేశ్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ విద్యార్థులు చాలాకాలంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. ఈ క్రమంలో వీసీ రమేశ్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News