Jagan: లండన్ చేరుకున్న సీఎం జగన్... వీడియో ఇదిగో!

CM Jagan arrives London

  • ఏపీలో ముగిసిన పోలింగ్
  • కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయల్దేరిన సీఎం జగన్
  • తిరిగి ఈ నెల 31న ఏపీకి రాక

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రాత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో విదేశీ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇవాళ లండన్ చేరుకున్నారు. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. 

ఇదిలావుంచితే, ఏపీలో వైసీపీ గెలుపు ఖాయం అంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉత్సాహం ప్రదర్శిస్తోంది. సీఎం జగన్ రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా జూన్ 9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని, సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చింది.

Jagan
London
YSRCP
Andhra Pradesh

More Telugu News