pat cummins: హైదరాబాద్ లో స్కూల్ విద్యార్థులతో కలిసి ప్యాట్ కమిన్స్ గల్లీ క్రికెట్‌.. వీడియో వైరల్

Pat Cummins plays cricket with school kids in Hyderabad
  • హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో జెడ్పీ పాఠశాలలో సరదాగా క్రికెట్ ఆడిన ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్
  • స్కూల్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు
  • కొన్ని రోజులుగా హైదరాబాద్ సంస్కృతిని అలవాటు చేసుకుంటున్న ఆసీస్ స్టార్
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు కెప్టెన్‌ వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్‌ కమిన్స్‌ హైదరాబాద్ లో సందడి చేశాడు. చంపాపేట పరిధిలోని కర్మన్‌ఘాట్‌లో ఉన్న ఓ జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులతో కలిసి శుక్రవారం సరదాగా క్రికెట్‌ ఆడాడు. 

ఇందుకు సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. స్కూల్ ఆవరణలోని గ్రౌండ్ లో కమిన్స్ బ్యాట్ పట్టగా ఓ విద్యార్థి బౌలింగ్ చేయడం ఆ వీడియోలో కనిపించింది. 

వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాల ఏర్పాటు చేసిన బూట్‌ క్యాంపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిన్స్ హాజరై విద్యార్థులను ఇలా ఉత్తేజపరిచాడు. 

ప్యాట్ కమిన్స్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సంస్కృతిలో భాగమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రోడ్డు పక్కన అమ్మే పావ్ బాజీ లాంటి డిషెస్ ను అతను ఎంతో ఇష్టంగా తిన్నాడు. కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాదీ బిర్యానీని కూడా టేస్ట్ చేశాడు. కొద్దికొద్దిగా తెలుగులోనూ మాట్లాడి అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రంలో పాప్యులర్ అయిన హుక్ స్టెప్ ను వేసి చూపించి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు.
pat cummins
IPL 2024
Sunrisers Hyderabad
Captain
gully cricket
govt school children
plays

More Telugu News