Taj Mahal: ఆగ్రాలో తాజ్ మహల్ కు గట్టి పోటీగా నిలిచిన తాజా కట్టడం!

Taj Mahal Gets Competition As New White Marble Marvel Opens In Agra

  • పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న 193 అడుగుల భారీ పాలరాతి కట్టడం
  • ఆధ్యాత్మిక గురువు పూరణ్ ధనీ స్వామీజీ మహరాజ్ గౌరవార్థం రూపుదిద్దుకున్న సమాధి
  • 1904లో మొదలైన నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తి

ఆగ్రా పేరు చెప్పగానే అందరికీ 17వ శతాబ్దం నాటి ప్రఖ్యాత కట్టడం, ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌ మహల్ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఆగ్రాకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే రూపుదిద్దుకున్న ఓ 193 అడుగుల భారీ కట్టడం తాజ్ కు పోటీగా నిలుస్తోంది! అదే రాధాస్వామి భక్తి మార్గానికి బాటలు పరిచిన ఆధ్యాత్మిక గురువు పరమ్ పురుష్ పూరణ్ ధనీ స్వామీజీ మహరాజ్ పాలరాతి సమాధి! ఆగ్రాలోని దయాల్ బాగ్ ప్రాంతంలో ఉన్న సోమీబాగ్ కాలనీలో ఆయన అనుచరులు దీన్ని నిర్మించారు. 

నిత్యం తాజ్ మహల్ సందర్శనకు వచ్చే వేలాది మంది పర్యాటకులు ఇప్పుడు సోమీబాగ్ లో నిర్మించిన ఈ కట్టడం నిర్మాణ కౌశలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. తాజ్ లాగే దీన్ని కూడా పూర్తిగా పాలరాయితోనే నిర్మాంచారు. రాజస్థాన్ లోని మక్రానా, జోధ్ పూర్ నుంచి తెప్పించిన పాలరాయిని దీని నిర్మాణానికి ఉపయోగించారు.

అయితే తాజ్ మహల్ నిర్మాణానికి సుమారు 22 ఏళ్లు పడితే పూరణ్ ధనీ స్వామీజీ మహరాజ్ సమాధి నిర్మాణానికి ఏకంగా వందేళ్లకుపైగా పట్టడం గమనార్హం. 1904లో నిర్మాణ పనులు ప్రారంభించగా ఎన్నో అవాంతరాల కారణంగా అవి నిలిచిపోయాయి. 1922 నుంచి తిరిగి మొదలుపెట్టగా అవాంతరాలు దాటుకుంటూ ఇప్పుడు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా తుదిమెరుగులు దిద్దుతున్నారు. ముఖ్యంగా 31.4 అడుగుల ఎత్తైన, గుండ్రటి బంగారు పూత గుమ్మటం తాజ్ మహల్ గుమ్మటంకన్నా పెద్దదని దీని నిర్మాణదారులైన పూరణ్ ధనీ స్వామీజీ మహరాజ్ అనుచరులు చెప్పారు. ఈ గుమ్మటాన్ని దాని స్థానంలో అమర్చేందుకు ఢిల్లీ నుంచి ఓ భారీ క్రేన్ ను తీసుకొచ్చినట్లు వివరించారు.

యూపీ, పంజాబ్, కర్ణాటకతోపాటు విదేశాల్లో లక్షలాది మంది రాధాస్వామి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నారు.

  • Loading...

More Telugu News