Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. సమయం పొడిగింపు

Hyderabad Metro Rail Now Runs After Night 11 PM Also

  • ప్రస్తుతం రాత్రి 11 గంటలకు చివరి రైలు
  • ఇకపై రాత్రి 11.45 గంటలకు కూడా ప్రయాణం చేసే వెసులుబాటు
  • ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే తొలి రైలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేళ్లలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండగా, దీనిని మరో 45 నిమిషాలు పొడిగించారు. అంటే ఇకపై రాత్రి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉంటుంది.

అలాగే, ప్రస్తుతం ఉదయం ఆరు గంటలకు తొలి రైలు అందుబాటులో ఉండగా, ఇకపై ప్రతి సోమవారం 5.30 గంటలకే తొలి రైలు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు. పొడిగించిన వేళలు నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చాయి.

Hyderabad Metro
Metro Timings
Hyderabad
  • Loading...

More Telugu News