Nicholas Pooran: పూరన్ సిక్సర్ల వర్షం... ముంబయి ముందు భారీ లక్ష్యం

LSG set Mumbai Indians 215 runs target

  • ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసిన లక్నో
  • 29 బంతుల్లో 75 పరుగులు చేసిన పూరన్
  • 5 ఫోర్లు, 8 సిక్సర్లతో విధ్వంసం

ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. 

లక్నో ఇన్నింగ్స్ లో నికోలాస్ పూరన్ బ్యాటింగే హైలైట్ గా నిలుస్తుంది. పూరన్ కేవలం 29 బంతుల్లోనే 75 పరుగులు చేయడం విశేషం. పూరన్ స్కోరులో 5 ఫోర్లు, 8 సిక్సులు బాదాడు. అతడికి కెప్టెన్ కేఎల్ రాహుల్ నుంచి చక్కని సహకారం లభించింది. రాహుల్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 55 పరుగులు చేశాడు. 

స్టొయినిస్ 28 పరుగులు చేయగా, చివర్లో ఆయుష్ బదోనీ మెరుపుదాడి చేశాడు. 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 22 పరుగులు చేశాడు. 

ఓ దశలో లక్నో జట్టు స్కోరు 230 వరకు వెళుతుందనిపించింది. అయితే, పూరన్ అవుటయ్యాక స్కోరు మందగించింది. లక్నో జట్టు 178 పరుగుల వద్దే పూరన్, అర్షద్ ఖాన్, కేఎల్ రాహుల్ ల వికెట్లు కోల్పోయింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో నువాన్ తుషార 3, పియూష్ చావ్లా 3 వికెట్లు తీశారు. 

ఇక, లక్ష్యఛేదనలో ముంబయి జట్టు ధాటిగా ఆడుతోంది. అయితే వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం వల్ల ఆట ఆగిపోయే సమయానికి ముంబయి 3.5 ఓవర్లలో 33 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 20, డివాల్డ్ బ్రెవిస్ 9 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News