SIT: ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్... అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt appointed SIT under IG Vineeth Brijlal

  • ఏపీలో పోలింగ్ రోజున, తర్వాత అల్లర్లు
  • తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఘటనలు
  • సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన ఈసీ
  • ఈసీ ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో పోలింగ్ , అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 13 మంది సభ్యులతో కూడిన ఈ సిట్ కు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వం వహించనున్నారు.

ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, తిరుపతి ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి, గుంటూరు రేంజి పరిధిలో వీఆర్ లో ఉన్న పోలీసు అధికారి భూషణం, వెంకట్రావు, రామకృష్ణ, జీఎల్ శ్రీనివాస్, ఏసీబీ డీఎస్పీ శివప్రసాద్, మొయిన్, ప్రభాకర్ ఈ సిట్ లో సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.  

తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన ఘటనలపై ఈ సిట్ నివేదిక రూపొందించి ఈసీకి సమర్పించనుంది. సిట్ ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఏపీ సీఈవోకు తాత్కాలిక నివేదిక అందించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News