KA Paul: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేఏ పాల్‌పై చీటింగ్ కేసు

Cheating case against KA Paul in PS

  • రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడెంకు చెందిన కిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు
  • ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపణ
  • ఆన్ లైన్ ద్వారా రూ.30 లక్షలు, వివిధ దఫాలుగా నగదు రూపంలో రూ.20 లక్షలు ఇచ్చానని ఫిర్యాదు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడెంకు చెందిన వ్యక్తి యస్ కిరణ్ ఫిర్యాదు చేశారు.

తనకు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఇస్తానని డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనకు రూ.30 లక్షలు ఆన్ లైన్ ద్వారా, మిగిలిన రూ.20 లక్షలు పలు దఫాలుగా నగదు రూపంలో ఇచ్చానని పేర్కొన్నారు. కిరణ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.

KA Paul
Ranga Reddy District
Hyderabad
  • Loading...

More Telugu News