IPL 2024: ఎస్ఆర్‌హెచ్ ఓన‌ర్ కావ్యా మారన్‌కు కేన్ మామ‌ హ‌గ్.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Kane Williamson Hugs SRH owner Kavya Maran Video goes Viral

  • వర్షం కార‌ణంగా నిన్న‌టి ఎస్ఆర్‌హెచ్, జీటీ మ్యాచ్ క్యాన్సిల్‌
  • ఈ క్ర‌మంలో ఉప్ప‌ల్ మైదానంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న 
  • ఎస్ఆర్‌హెచ్ ఓన‌ర్ కావ్యా మారన్‌ను క‌లిసిన ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్
  • ఇద్ద‌రూ స‌ర‌దాగా కాసేపు క‌బుర్లు చెప్పుకున్న వైనం  

గురువారం సొంత మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జ‌ట్టు నేరుగా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన‌ విష‌యం తెలిసిందే. అయితే, మ్యాచ్ క్యాన్సిల్ అయిన క్ర‌మంలో ఉప్ప‌ల్ మైదానంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ గ‌తంలో కొన్నేళ్లు స‌న్‌రైజ‌ర్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఎస్ఆర్‌హెచ్‌కు కొన్ని మ్యాచుల‌లో సార‌ధిగానూ వ్య‌వ‌హ‌రించాడు.

అయితే, గ‌తేడాది నుంచి ఆయ‌న‌ గుజ‌రాత్ టైటాన్స్‌కు ఆడుతున్నారు. ఇక హైద‌రాబాద్‌తో మ్యాచ్ కోసం ఉప్ప‌ల్ వ‌చ్చిన కేన్ మామ‌.. ప్రేక్ష‌కుల మ‌ధ్య‌ స్టేడియంలో ఉన్న ఆ జ‌ట్టు ఓన‌ర్ కావ్యా మార‌న్‌ను క‌లుసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ త‌ర్వాత కావ్యా మార‌న్‌ను హ‌గ్ చేసుకున్నాడు. అనంత‌రం ఇద్ద‌రూ కాసేపు ముచ్చ‌టించుకున్నారు. కావ్యాను కేన్ విలియ‌మ్స‌న్‌ హ‌గ్ చేసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఇక ఈ ఏడాది ఆరెంజ్ ఆర్మీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్న విష‌యం తెలిసిందే. ఈసారి అనేక రికార్డుల‌ను ఎస్ఆర్‌హెచ్ త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు త‌న జ‌ట్టు ఏకంగా ప్లేఆఫ్స్‌కు చేర‌డంతో ఓన‌ర్ కావ్యా మార‌న్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More Telugu News