Diabetes: సగానికి సగం తగ్గిన డయాబెటిస్, గుండె జబ్బుల మందుల ధరలు
- సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలతోపాటు మరో ఆరు రకాల మందుల ధరల తగ్గింపు
- నోటిఫికేషన్ జారీచేసిన ఎన్పీపీఏ
- దేశంలో 10 కోట్ల మందికిపైగా మధుమేహ రోగులు
- రూ. 16కు దిగిన వచ్చిన డపాగ్లిఫోజిన్ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్ ధర
సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలతోపాటు మధుమేహం, గుండె జబ్బులు తదితర ఆరు రకాల చికిత్సలో వాడే మందుల ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా, డయాబెటిస్, ఒళ్లు నొప్పులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్స్, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, మల్టీవిటమిన్, యాంటీబయాటిక్ మందుల ధరలు దిగిరానున్నాయి. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా భారత్‌లో 10 కోట్లమందికిపైగా మధుమేహ బాధితులున్నారు. మందులు, ఇన్సులిన్‌పై ఆధారపడే వారికి ధరల తగ్గింపు పెద్ద ఉపశమనంగానే చెప్పుకోవాలి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకునేందుకు వేసుకునే డపాగ్లిఫోజిన్ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్ ధర ఒకటి ప్రస్తుతం రూ. 30 ఉండగా, అదిప్పుడు రూ. 16కు దిగివచ్చింది. వీటితో పాటు పైన పేర్కొన్న మందుల ధరలన్నీ భారీగా తగ్గాయి.