AP CS: ఏపీలో హింసపై ఢిల్లీలో ఈసీకి వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP CS and DGP with EC in Delhi

  • ఏపీలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు
  • సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించిన ఈసీ
  • హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ

ఏపీలో పలుచోట్ల పోలింగ్ రోజున, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్, డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించింది. సీఈసీ ముందు దాదాపు అరగంట సేపు సీఎస్, డీజీపీ వివరణ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను ఈసీకి వివరించారు. కొన్ని వర్గాల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే అల్లర్లు చెలరేగాయని సీఎస్, డీజీపీ తెలిపారు. హింసాత్మక ఘటనలను ఎందుకు అదుపు చేయలేకపోయారని వీరిని ఈసీ ప్రశ్నించింది. విచ్చలవిడిగా హింసాత్మక ఘటనలు చెలరేగుతుంటే ఎందుకు అదుపు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు.

AP CS
AP DGP
EC
  • Loading...

More Telugu News