Actor Naresh: 'ఏపీలో శాంతి నెల‌కొనాల‌ని కోరుకుంటున్నా'.. సినీ న‌టుడు న‌రేశ్ ట్వీట్!

Actor Naresh Tweet on Andhra Pradesh Situation after Elections 2024

  • రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద‌ ర‌క్త‌పాతం జ‌రుగుతుంద‌ని గ‌తంలో న‌రేశ్ ట్వీట్
  • తాను ఊహించిన‌ట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు ర‌క్త‌పాతం జ‌రిగింద‌న్న న‌రేశ్‌
  • ప్ర‌స్తుతం నెలకొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు తొలిగిపోవాల‌ని ఆకాంక్షించిన న‌టుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యమై న‌టుడు న‌రేశ్ తాజాగా 'ఎక్స్' (ట్విట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. తాను ఊహించిన‌ట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు ర‌క్త‌పాతం జ‌రిగింద‌ని ఆయ‌న‌ ట్వీట్ చేశారు. "ఏపీలో ఎన్నిక‌ల పోరు ముగిసింది. ఓట‌ర్లు తీర్పు ఇచ్చారు. ప్ర‌జ‌ల‌కు అత్యంత ఇష్ట‌మైన నాయ‌కులు గెల‌వాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు తొలిగిపోయి శాంతి నెల‌కొనాల‌ని కోరుకుంటున్నా" అని న‌రేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 
 

ఇక ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఏపీలో అధికార మార్పిడికి ముందు ర‌క్త‌పాతం జ‌రుగుతుంద‌ని గ‌తంలో న‌రేశ్ ట్వీట్ చేశారు. "రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్త‌పాతం జ‌రిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని నా న‌మ్మ‌కం" అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. అప్పుడు న‌రేశ్ చేసిన ట్వీట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

More Telugu News