Pulivarti Nani: పులివర్తి నానిపై దాడి కేసు: ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డి అరెస్ట్

Police arrest accused in attack on Pulivarti nani

  • ఈ నెల 14న తిరుపతిలో పులివర్తి నానిపై దాడి
  • తాజాగా కేసులో పురోగతి
  • 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • 14 రోజుల రిమాండ్ విధించిన తిరుపతి ఏడీజే కోర్టు
  • నిందితులను చిత్తూరు సబ్ జైలుకు తరలించిన పోలీసులు

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో పురోగతి కనిపించింది. ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు దాడిలో పాల్గొన్నట్టుగా భావిస్తున్న మరో 11 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ 13 మందిని పోలీసులు తిరుపతి ఏడీజే కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజల రిమాండ్ విధించారు. దాంతో, నిందితులను చిత్తూరు సబ్ జైలుకు తరలించారు.

పోలింగ్ ముగిసిన అనంతరం, ఈ నెల 14న పులివర్తి నాని తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనపై వైసీపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. 

ఈ దాడిలో గాయపడిన పులివర్తి నాని త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నిందితులు ఈ దాడిలో గొడ్డళ్లు, కర్రలు, సమ్మెటలు వాడినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పులివర్తి నాని గన్ మన్ తలకు బలమైన గాయం అయింది.

Pulivarti Nani
Attack
TDP
YSRCP
Chandragiri
Tirupati
  • Loading...

More Telugu News