Mukku Avinash: ఆ వ్యక్తి కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు: ముక్కు అవినాశ్

Mukku Avinash Interview

  • కమెడియన్ గా అవినాశ్ బిజీ 
  • 'ముక్కు' యాడ్ కావడానికి కారణం అదేనని వివరణ 
  • అలా అవమానం జరిగిందని ఉద్వేగం 
  • మెగాస్టార్ ను కలవడం గొప్పవిషయమని వెల్లడి  


ముక్కు అవినాశ్ .. టీవీలలో కామెడీ షోస్ చూసేవారికి పరిచయం అవసరం లేని పేరు. ఎక్కువగా సాయికుమార్ వాయిస్ .. ఏఎన్నార్ డాన్స్ ను ఇమిటేట్ చేయడం వలన పాప్యులర్ అయ్యాడు. తాజాగా ట్రీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నా పేరుకి ముందు 'ముక్కు' అని రావడానికి కారణం ఉంది. 'ముక్కు'పై నేను జబర్దస్త్ లో ఒక స్కిట్ చేశాను. అప్పటి నుంచి రోజా గారు .. గెటప్ శ్రీనుగారు నాకు ఆ పేరు పెట్టారు" అని అన్నాడు. 

నా జీవితంలో తీపి జ్ఞాపకం ఒకటి ఉంది. అదేమిటంటే చిరంజీవిగారిని కలుసుకోవడం .. ఆయనతో మాట్లాడటం. ఇక చేదు సంఘటన కూడా ఉంది. నేను ఒక సాయం కోసం ఒక వ్యక్తి కాళ్లు పట్టుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆ పని చేయవలసి వచ్చింది. కానీ ఆ వ్యక్తి కనికరించలేదు" అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. 

"ఇక రీసెంటుగా నేను 'ఓం భీమ్ బుష్' సినిమాలో చేశాను. ఆ సినిమా కోసం నేను 8 రోజులు పనిచేశాను. అయితే నిడివి ఎక్కువ కావడం వలన ఆ సీన్స్ లేపేయడం జరిగిందని ముందుగానే దర్శకుడు నాకు చెప్పాడు. ఆ సినిమాలో 'సంపంగి' దెయ్యం దగ్గర పనివాడి పాత్ర చేశాను. అది లేపేయడం బాధపడవలసిన విషయమే" అని చెప్పాడు. 

Mukku Avinash
Jabardasth
Roja
  • Loading...

More Telugu News