G. Kishan Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై 'నో కామెంట్' అన్న కిషన్ రెడ్డి... సమాధానం చెప్పే వరకు వదలని మీడియా

Kishan Reddy comments on AP politics

  • ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం
  • ఎన్డీయే అలయెన్స్‌లో ఉంది కదా ఏం చెబుతారని ప్రశ్నించిన మీడియా
  • తెలంగాణ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నానన్న కిషన్ రెడ్డి
  • కేంద్రమంత్రిగా ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించిన జర్నలిస్టులు
  • ఏపీలో ఎన్డీయే కచ్చితంగా గెలుస్తుందన్న కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించేందుకు నిరాకరించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఏపీ రాజకీయాలపై ప్రశ్నించారు. దానికి కిషన్ రెడ్డి 'నో కామెంట్' అన్నారు.

ఏపీలో ఎన్డీయే అలయెన్స్ ఉంది కాబట్టి ఏం చెబుతారని మీడియా ప్రతినిధులు అడగగా... తాను తెలంగాణ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఏపీలో ఎన్డీయే అలయెన్స్ ఉందని, మీరు కేంద్రమంత్రిగా ఏం మాట్లాడుతారని మీడియా ప్రతినిధులు తిరిగి ప్రశ్నించారు.

దీనికి కిషన్ రెడ్డి స్పందిస్తూ... తాను ఒకటి మాత్రం చెప్పగలనని... కచ్చితంగా ఆంధ్రాలో ఎన్డీయే గెలుస్తుందని చెప్పగలనని వ్యాఖ్యానించారు. తమకు దేశవ్యాప్తంగా 400 సీట్లు కచ్చితంగా వస్తాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రచారం అంత బాగా లేదని చెబితే... మరి రాహుల్ గాంధీ ప్రచారం బాగుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ డిజిట్ వస్తుందని చెప్పామని... కానీ ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ మినహాయించి... తెలంగాణలో, దేశవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. 'రెండు పార్టీల మధ్య, అభ్యర్థుల మధ్య నిరాశ, నిస్పృహలు ఉండవచ్చు.. పట్టుదల ఉండవచ్చు. రాయలసీమలో ప్రశాంతంగా జరిగాయి. గుంటూరులో కాస్త గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. నాకు ఇంకా ప్రత్యక్షంగా సమాచారం రాలేదు' అన్నారు.

  • Loading...

More Telugu News