Chandrababu: రేపు మహారాష్ట్రకు చంద్రబాబు.. కొల్లాపూర్ ఆలయాన్ని సందర్శించనున్న టీడీపీ అధినేత

Chandrabau to visit Kolhapur Sri Mahalakshmi temple

  • శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు 
  • ఆపై షిర్డీ వెళ్లి సాయిబాబా ఆలయ సందర్శన
  • ఎన్నికలు ముగిసిన వెంటనే తిరుమల వెళ్లిన బాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రేపు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. అక్కడి శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం షిర్డీ చేరుకుని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. రేపు మహారాష్ట్ర వెళ్తున్నారు. కాగా, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమాగా ఉన్న చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా గడుపుతున్నారు.

More Telugu News