Koppula Eshwar: ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజాసమస్యలపై ఉద్యమిస్తా: కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar on lok sabha election

  • లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేశాయన్న ఈశ్వర్
  • కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలయ్యేంత వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని వెల్లడి

ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం ఆయన పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలయ్యేంత వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. లోక్ సభ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం అహర్నిశ‌లు క‌ష్టపడ్డ పార్టీ సైనికులంద‌రికీ హృద‌య‌పూర్వక ధ‌న్యవాదాలు తెలిపారు.

Koppula Eshwar
BRS
Lok Sabha Polls
Peddapalli District
  • Loading...

More Telugu News