Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటి ఉన్న విమానంలో సాంకేతిక లోపం.. గంటకుపైగా రన్‌వేపైనే

Minister Ponguleti and others trapped in IndiGo flight

  • హైదరాబాద్ నుంచి కొచ్చిన్ బయలుదేరిన విమానం
  • టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా సాంకేతిక లోపం
  • విమానంలో మంత్రితోపాటు పలువురు నాయకులు

తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అది రన్‌వేపైనే నిలిచిపోయింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో గంటకుపైగా రన్‌వేపైనే విమానం నిలిచిపోయింది.

దీంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక, మంత్రితోపాటు విమానంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జరే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మొవ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.

Ponguleti Srinivas Reddy
Congress
Shamshabad Airport
  • Loading...

More Telugu News