Jogi Ramesh: ఇవాళ టీడీపీ గూండాలు రెచ్చిపోయారు: ఏపీ మంత్రి జోగి రమేశ్

Jogi Ramesh fires on TDP cadre

  • ఏపీలో ఇవాళ ఎన్నికలు
  • కృష్ణా జిల్లా పోరంకిలో ఉద్రిక్త పరిస్థితులు
  • మంత్రి జోగి రమేశ్ అనుచరుడిపై దాడి
  • పోలీసుల సమక్షంలోనే కొట్టారన్న మంత్రి

కృష్ణా జిల్లా పోరంకిలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన అనుచరుడు ఆరేపల్లి రాముపై దాడి జరిగిందని, టీడీపీ గూండాలు అరాచకాలకు పాల్పడ్డారంటూ ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. 

దొంగ ఓట్లు వేస్తున్నారని తెలిసి ఆరేపల్లి రాము అడ్డుకున్నాడని, కానీ అతడిపై కర్రలతో దాడి చేశారని మంత్రి ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. టీడీపీ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 

మంత్రి జోగి రమేశ్ గత ఎన్నికల్లో పెడన నుంచి గెలవగా, ఈసారి బదిలీల్లో భాగంగా పెనమలూరు నుంచి బరిలో దిగారు. పెనమలూరులో టీడీపీ నుంచి బోడె ప్రసాద్ పోటీలో ఉన్నారు.

Jogi Ramesh
Penmaluru
YSRCP
TDP
Krishna District
  • Loading...

More Telugu News