Telangana: తెలంగాణలో ముగిసిన పోలింగ్ సమయం... క్యూలో నిలుచున్న వారికి అవకాశం

Pollin time ends in Telangana

  • 17 లోక్ సభ నియోజకవర్గాలలో ముగిసిన పోలింగ్ సమయం
  • చాలా ప్రాంతాల్లో రాత్రి వరకు పోలింగ్ కొనసాగే అవకాశం
  • ఓటేసిన గ్రామీణం... హైదరాబాద్‌లో స్వల్పంగానే ఓటింగ్ శాతం

తెలంగాణలో పోలింగ్ సమయం ముగిసింది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 6 గంటల లోపు క్యూలో నిలుచున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. క్యూలో నిలబడిన వారు ఓటు వేసేంతవరకు పోలింగ్ కొనసాగుతుంది. క్యూలో నిలుచున్న వారు చాలామంది ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకు పోలింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగిసింది.

ఓటేసిన గ్రామీణ తెలంగాణ... తీరుమారని నగరవాసులు

తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదయింది. గ్రామీణ తెలంగాణలో పోలింగ్ శాతం దాదాపు 70 శాతం దాటింది. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసేసరికి 80 శాతం నుంచి 90 శాతానికి కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కానీ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ వంటి పట్టణ నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ కనీసం 50 శాతం దాటలేదు. హైదరాబాద్‌లో అయితే 39 శాతం మాత్రమే నమోదయింది. సికింద్రాబాద్‌‌లో 42 శాతం, మల్కాజ్‌గిరిలో 46 శాతం నమోదయింది. క్యూలైన్లో ఉన్న వారు ఓటేసినప్పటికీ 50 శాతం నుంచి 60 శాతం దాటేలా కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ప్రతిసారి ఓటింగ్ తక్కువగానే నమోదవుతూ వస్తోంది.

Telangana
Lok Sabha Polls
Hyderabad
  • Loading...

More Telugu News