Sreemukhi: పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న శ్రీముఖి?

Sreemukhi getting ready for marriage

  • బుల్లితెర టాప్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి
  • మూడు పదులు దాటుతున్నా పెళ్లి చేసుకోని అందాల భామ
  • శ్రీముఖి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారన్న ముక్కు అవినాశ్

తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి... అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తొలుత సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత యాంకర్ గా మారింది. 'పటాస్' వంటి ప్రోగ్రామ్ తో క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి... ఆ తర్వాత పలు షోలతో టాప్ యాంకర్ గా అవతరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 4, 5 షోలు ఉన్నాయి. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా, జెమిని తదితర ఛానళ్లలో ఆమె షోలు చేస్తోంది. 

మరోవైపు శ్రీముఖి వయసు మూడు పదులు దాటిపోతోంది. ఆమె పెళ్లి ఎప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆమె పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... శ్రీముఖి తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తున్నారని తెలిపాడు. ఈ ఏడాది ఆమె పెళ్లి జరిగే అవకాశం ఉందని చెప్పాడు. శ్రీముఖికి నచ్చిన కుర్రాడు దొరికితే పెళ్లి అయిపోతుందని తెలిపాడు.

Sreemukhi
Marriage
Tollywood
  • Loading...

More Telugu News