Roja: కొందరు వైసీపీ నేతలు నన్ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు: రోజా

Some YSRCP leaders are trying for my defeat says Roja

  • నగరిలో సొంత పార్టీ నేతలపై రోజా ఫైర్
  • కేజే కుమార్, ఆయన అనుచరులు తనను ఓడించే పని చేస్తున్నారని మండిపాటు
  • సొంత పార్టీ నేతలు ఇలా చేయడం దురదృష్టకరమని వ్యాఖ్య

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చాలా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ... కొన్ని చోట్ల మాత్రం తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. తాజాగా రోజా మాట్లాడుతూ... తనను ఓడించేందుకు కొందరు వైసీపీ నేతలు పని చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న కేజే కుమార్, ఆయన వర్గీయులు తన ఓటమి కోసం యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలు ఇలా చేయడం దురదృష్టకరమని చెప్పారు. వైసీపీలో కీలక నేత, మంత్రి పెద్దారెడ్డితో కూడా రోజాకు విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Roja
YSRCP
  • Loading...

More Telugu News