Polls: ఏపీలో ముమ్మరంగా పోలింగ్... మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం ఓటింగ్

Polling in AP continues

  • దేశవ్యాప్తంగా నేడు నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు
  • ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్
  • పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్న ఓటర్లు
  • గ్రామాలు, పట్టణాల్లో పోలింగ్ బూత్ ల వద్ద ఉత్సాహభరిత వాతావరణం

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఓటర్లు పోలింగ్ బూత్ లకు భారీగా తరలి రావడం చర్చనీయాంశంగా మారింది. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ముమ్మరంగా పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీలో 55.49 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామాల నుంచి పట్టణాల వరకు పోలింగ్ బూత్ ల వద్ద ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా, చాలామంది యువత తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మధ్యాహ్న సమయానికి వేల సంఖ్యలో ఓటర్లతో చాలాచోట్ల పోలింగ్ బూత్ లు కిటకిటలాడాయి. తెనాలి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినా ఓటర్లు లెక్కచేయని పరిస్థితి కనిపిస్తోంది.

Polls
Andhra Pradesh
4th Phase
General Elections-2024
  • Loading...

More Telugu News