Lok Sabha Polls: ఓటేసిన బ్రహ్మానందం... హైదరాబాద్‌లో తక్కువ పోలింగ్ నమోదవుతోంది కదా అంటే... ఇదీ సమాధానం

Brahmanandam cast his vote in Hyderabad

  • హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీలో ఓటు వేసిన బ్రహ్మానందం
  • ఓటర్లకు ఏం చెబుతారు? అని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు
  • ప్రతి ఒక్కరు ఓటు హక్కును బాధ్యతగా భావించాలన్న బ్రహ్మానందం

సినీ హాస్యనటుడు బ్రహ్మానందం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించారు. ఓటర్లకు ఏం చెబుతారు? అని వారు ప్రశ్నించారు. దానికి బ్రహ్మానందం స్పందిస్తూ... ఓటర్లకు అప్పీల్ చేసేది ఏముందమ్మా... గంటలో మొత్తం అయిపోతుంది... ప్రతి ఒక్కరు ఓటు హక్కును బాధ్యతగా భావించాలన్నారు. హైదరాబాద్‌లో తక్కువ పోలింగ్ నమోదవుతుంది కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి బ్రహ్మానందం స్పందిస్తూ... దానికి నేనేం చేయనని సరదాగా అన్నారు.

Lok Sabha Polls
BJP
Brahmanandam
Hyderabad

More Telugu News