Madhava Rao: అప్పట్లో స్టార్స్ అలా డబ్బులు పోగొట్టుకున్నారట!

Madhava Rao Interview

  • కృష్ణ మేకప్ మెన్ గా పనిచేసిన మాధవరావు 
  • నిర్మాతగా మారడం ఇష్టం లేదని వెల్లడి
  • కృష్ణ ప్రోత్సహించారని వివరణ 
  • ఇప్పటి హీరోలు జాగ్రత్తపరులని వ్యాఖ్య   


సప్పర్ స్టార్ కృష్ణకు పర్సనల్ మేకప్ మెన్ గా మాధవరావు పనిచేసేవారు. 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " అప్పట్లోనే చాలామంది మేకప్ మేన్ లు నిర్మాతలుగా మారారు. ఆ సమయంలో నన్ను కూడా నిర్మాతగా మారమని కృష్ణగారు అన్నారు. అందుకు అవసరమైన ఆర్ధిక సహకారాన్ని అందిస్తామని కృష్ణగారి బ్రదర్స్ కూడా అన్నారు. కానీ నా వల్ల కాదని తేల్చి చెప్పేశాను" అని అన్నారు. 

"అప్పట్లో చాలామంది స్టార్స్ విపరీతంగా సంపాదించారు. అయితే కొంతమంది మద్యానికి బానిసలయ్యారు. కొంతమంది అవకాశాలు తగ్గడం వలన .. మరికొంతమంది బిజీగా ఉండగానే తాగుడికి బానిసలయ్యారు. దాంతో ఆరోగ్యం .. అవకాశాలు .. ఆదాయం అన్నీ పడిపోయాయి. అలా ఆస్తులు పోగొట్టుకున్నారు" అని చెప్పారు. 

ఇంకా కొంతమంది స్టార్స్ రేసులు ఆడటం వలన ఎక్కువ పోగొట్టుకున్నారు. మిగతా ఆర్టిస్టులలో ఎక్కువమంది పేకాట వలన పోగొట్టుకున్నారు. కానీ ఈ జనరేషన్ హీరోలను మెచ్చుకోవాలి. వచ్చిన డబ్బును ఎలా కాపాడుకోవాలి? ఎలా పెంచుకోవాలి? అనే విషయాలపై శ్రద్ధ పెడుతున్నారు. అలాంటి హీరోలను చూస్తే నాకు ముచ్చటగా అనిపిస్తుంది" అని అన్నారు. 

Madhava Rao
Krishna
Rajababu
Kantha Rao
  • Loading...

More Telugu News