SS Rajamouli: మా క‌ర్త‌వ్యం పూర్త‌యింది.. మ‌రి మీది?: రాజ‌మౌళి

SS Rajamouli Caste his Vote with his Wife Rama Rajamouli

  • షేక్‌పేట్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో ఓటు వేసిన‌ రాజ‌మౌళి దంప‌తులు
  • దుబాయ్ నుంచి వ‌చ్చిన భార్య ర‌మ‌తో క‌లిసి నేరుగా పోలింగ్ బూత్‌కి వెళ్లిన‌ట్లు ట్వీట్‌
  • ప్ర‌తిఒక్క‌రూ క‌ర్త‌వ్యంగా ఓటు వేయాల‌న్న రాజ‌మౌళి

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. దుబాయ్ నుంచి వ‌చ్చిన త‌న భార్య ర‌మ‌తో క‌లిసి నేరుగా హైద‌రాబాద్‌లోని షేక్‌పేట్ ఇంట‌ర్నేష‌న‌ల్ పాఠ‌శాల‌లోని పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసిన‌ట్లు రాజమౌళి ట్వీట్ చేశారు. నా క‌ర్త‌వ్యం పూర్తయింది. మీరు ఓటు వేశారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాగా, ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇక  ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న విష‌యం తెలిసిందే. అలాగే తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది.

More Telugu News