Pawan Kalyan: మంగళగిరిలో ఓటేసిన జనసేనాని

Pawan Kalyan Caste His Vote In Mangalagiri

  • భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన పవన్ కల్యాణ్
  • పవన్ రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట
  • జనాలను కంట్రోల్ చేయడానికి సిబ్బంది అవస్థలు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం ఓటు వేశారు. లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోఆపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి భార్యతో కలిసి వచ్చారు. జనసేనాని రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. పవన్ ను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి కంట్రోల్ చేయడానికి, జనాలను అదుపు చేయడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.


Pawan Kalyan
janasenani
Cast Vote
Pawan Vote
AP Assembly Polls
Lok Sabha Polls

More Telugu News