Pulivendula: పులివెందులలో గాలివాన... తీవ్రంగా ఇబ్బందిపడిన ఎన్నికల సిబ్బంది

Wind storm in Pulivendula

  • పులివెందుల జేఎన్టీయూ కాలేజీలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు
  • ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
  • ఈదురుగాలులు, భారీ వర్షంతో బీభత్సం 

కడప జిల్లా పులివెందులలో ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలివాన బీభత్సం సృష్టించింది. పులివెందుల జేఎన్టీయూ కాలేజీలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసే కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన షామియానాలు, టెంట్లు ఈదురుగాలులకు కూలిపోయాయి. దాంతో ఎన్నికల సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్పందించిన అధికారులు పోలింగ్ సిబ్బందిని బస్సుల్లో మరో చోటుకు తరలించారు.

Pulivendula
Wind Storm
Rain
Kadapa District
  • Loading...

More Telugu News