NDA: ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను కలిసిన బీజేపీ నేతలు

BJP AP leaders met CEO in Vijayawada

  • రాయలసీమలో పలు నియోజకవర్గాలు సమస్యాత్మకమన్న  బీజేపీ నేతలు
  • ఆయా నియోజకవర్గాల్లో బలగాలను పెంచాలని సీఈవోకు వినతి
  • సీఈవోను కలిసిన వారిలో సాదినేని యామినీ శర్మ, కిలారు దిలీప్

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను ఇవాళ విజయవాడలో బీజేపీ నేతలు కలిశారు. రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో సాయుధ బలగాల సంఖ్యను పెంచాలని వారు మీనాకు విజ్ఞప్తి చేశారు. 

ముఖ్యంగా, జమ్మలమడుగు, ధర్మవరం, బద్వేల్ నియోజకవర్గాల్లో బలగాలను పెంచాలని, ఈ అంశంపై బీజేపీ నేత సత్యకుమార్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారని, ఆ కేసు తీర్పులో కోర్టు ఏం చెప్పింద్న విషయాన్ని కూటమి నేతలు సీఈవోకు వివరించారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని కోరారు. 

సీఈవో ముఖేశ్ కుమార్ ను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ, బీజేపీ సీనియర్ నేత కిలారు దిలీప్, అడ్వొకేట్ బాచన హనుమంతరావు, సీనియర్ నేత జయప్రకాశ్ ఉన్నారు.

NDA
CEO
Rayalaseema
TDP
BJP
Janasena
Security
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News