Torture: పాత కార్ల విక్రేతలను కిడ్నాప్ చేసి మర్మాంగాలపై కరెంట్ షాక్... కర్ణాటకలో దారుణం

Seven arrested after they tortures second hand car dealers by giving electric shocks on their private parts

  • కారు డెలివరీ ఆలస్యం అయిందన్న కోపంతో కొందరు వ్యక్తుల దుశ్చర్య
  • డీలర్లను నగ్నంగా మార్చి హింసిస్తూ పైశాచికానందం
  • వీడియో వైరల్
  • ఏడుగురిని అరెస్ట్ చేసిన కలబుర్గి పోలీసులు

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే ముగ్గురు డీలర్లను కిడ్నాప్ చేసిన వ్యక్తులు వారి మర్మాంగాలపై కరెంట్ షాక్ తో హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అసలేం జరిగిందంటే.... కలబుర్గి పట్టణంలో రమేశ్ మేదీవాలా, సమీరుద్దీన్, అబ్దుల్ రెహ్మాన్ సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్నారు. అయితే వీరివద్దకు కొందరు వ్యక్తులు కారు కోసం వచ్చారు. లావాదేవీలు పూర్తయ్యాక కారును డెలివరీ ఇవ్వడం ఆలస్యం అయింది. 

దాంతో ఆ వ్యక్తులు ముగ్గురు కారు డీలర్లను కిడ్నాప్ చేసి టార్చర్ చేశారు. వారిని నగ్నంగా మార్చి, వారి మర్మాంగాలపై కరెంట్ షాక్ లు ఇస్తూ పైశాచిక ఆనందం పొందారు. తమకు కారు ఇవ్వకుండా ఆలస్యం చేసినందుకు డబ్బు ఇవ్వాలని ఆ డీలర్లను డిమాండ్ చేశారు. ఈ ఘటన మే 4న జరిగింది. బాధితులు ఆ మరుసటి రోజున పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో పాలుపంచుకున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇమ్రాన్ పటేల్, మహ్మద్ మతీన్, రమేశ్ దొడ్డమణి, సాగర్ కోలీ, వారి సహచరులు ఉన్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News