Telangana: ఓటర్ స్లిప్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయండి: వికారాబాద్ జిల్లా కలెక్టర్

vikarabad district collector suggestion on vote on polling day

  • 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన
  • ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించుకోవచ్చని వెల్లడి
  • మోడల్ కోడ్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా 1950 లేదా సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్న కలెక్టర్
  • నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక

ఎల్లుండి లోక్ సభ ఎన్నికల్లో ఓటర్ స్లిప్‌తో పాటు ప్రభుత్వం సూచించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా ఆయన కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

ఆరు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసినందున లౌడ్ స్పీకర్లు, వాహనాలతో ఏ పార్టీ ప్రచారం నిర్వహించకూడదని సూచించారు. ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించుకోవచ్చుని తెలిపారు. మోడల్ కోడ్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా 1950 లేదా సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News