Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం!

Election Campaign ends today

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆరు గంటలకు ముగిసిన ప్రచారం
  • తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 8 రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో ఎల్లుండి పోలింగ్
  • తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు
  • ఏపీలో 25 లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగో విడత పోలింగ్ జరగనున్న పలు రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. నాలుగో విడత పోలింగ్ ఎల్లుండి జరగనుంది. బీహార్, జమ్ము కశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్లో... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ సమయం ముగిసే లోపు కేంద్రానికి వచ్చే వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

Andhra Pradesh
Telangana
Lok Sabha Polls
AP Assembly Polls
  • Loading...

More Telugu News