Deviprasad: కోడి రామకృష్ణగారి గొప్పతనం అదే: డైరెక్టర్ దేవి ప్రసాద్

Deviprasad Interview

  • దర్శకుడిగా .. నటుడిగా పేరు తెచ్చుకున్న దేవి ప్రసాద్
  • కోడి రామకృష్ణ దగ్గర పనిచేసిన అనుభవం 
  • ఆ రోజులను గుర్తుచేసుకున్న దర్శకుడు 
  • దాసరి - కోడి రామకృష్ణ అనుబంధాన్ని గురించిన ప్రస్తావన


తెలుగులో దాసరి నారాయణరావు - రాఘవేంద్రరావు తరువాత స్థానంలో కోడి రామకృష్ణ కనిపిస్తారు. అలాంటి కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా దేవిప్రసాద్ పనిచేశారు. తాజా ఇంటర్వ్యూలో దేవిప్రసాద్ మాట్లాడుతూ .. "మా గురువు కోడి రామకృష్ణగారు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఆయన దగ్గర పనిచేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు. 

" మా గురువుగారికి దాసరి నారాయణరావుగారు అంటే ప్రాణం. కోడి రామకృష్ణగారు తన హిట్ సినిమాలను గురించి .. ఆ సమయంలో జరిగిన సంఘటనలను గురించి ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఎప్పుడూ కూడా దాసరి గారి గొప్పతనం గురించి .. ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సినిమాలను గురించి మాత్రమే చెప్పేవారు. 

దర్శకులకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది దాసరి నారాయణరావుగారు. అప్పట్లో ఆయనకి స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉండేది. తాను ఒక గొప్ప డైరెక్టర్ అయిన తరువాత కూడా తన గురువు గొప్పతనం గురించి మాత్రమే చెప్పుకుంటూ రావడం కోడి రామకృష్ణగారి గొప్పతనంగా చెప్పుకోవచ్చు" అని అన్నారు. 

Deviprasad
Kodi Ramakrishna
Dasari Narayana Rao
  • Loading...

More Telugu News