YS Sharmila: మీ ఇంటి ఆడబిడ్డగా చూసుకుంటారని ఆశిస్తున్నా: వైఎస్​ షర్మిల

YS Sharmila appeals to Kadap Voters on Social Media

  • మీ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డ అనుకుని ఆశీర్వదించాలని కోరిన షర్మిల
  • కడప గడ్డపై న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్య  
  • న్యాయం వైపు నిలబడతారని నమ్ముతున్నానన్న షర్మిల  

మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల ఓటర్లను తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. మీ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఏ విధంగా ప్రేమగా చూసుకుంటారో అదేవిధంగా నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డగా చూసుకుంటారని ఆశిస్తున్నానని ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల కడప నియోజకవర్గ ఓటర్లను అభ్యర్థించారు.

సోమవారం జరిగే పోలింగ్ లో ఎంపీ బ్యాలెట్ నమూనాలో ఉన్న హస్తం గుర్తుపై బటన్ నొక్కి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగు చాచి అడుగుతున్నానని అందులో పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు కడప ఎంపీ స్థానానికి పోటీచేస్తోందని...కడప గడ్డ మీద న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో మీరంతా న్యాయం వైపు నిలబడతారని నమ్ముతున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

More Telugu News