Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు

Delhi HC postoponed Kavitha bail petition

  • మే 24వ తేదీకి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు
  • బెయిల్ పిటిషన్‌పై వాదనలకు సమయం కోరిన ఈడీ
  • తదుపరి గడువులోగా స్పందన తెలియజేయాలన్న హైకోర్టు జడ్జి

మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ కోరుతూ కవిత మొదట రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, విచారణ అనంతరం నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది. అయితే ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరింది. దీంతో విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. గడువు లోగా ఈడీ తన స్పందనను తెలియజేయాలని జస్టిస్ స్వరణ కాంత శర్మ ఆదేశించారు.

Delhi Liquor Scam
K Kavitha
BRS
Lok Sabha Polls
High Court
  • Loading...

More Telugu News