BJP: బీజేపీ అభ్యర్థిని గెలిపించండి: సికింద్రాబాద్‌లో టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఇంటింటి ప్రచారం

TTDP door to door campaign for BJP

  • బల్కంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు
  • మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్న కాట్రగడ్డ ప్రసూన
  • ఇది మోదీ సుపరిపాలనకు నిదర్శనమని వ్యాఖ్య

సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని గెలిపించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన పిలుపునిచ్చారు. శుక్రవారం టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె బల్కంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఇది మోదీ సుపరిపాలనకు నిదర్శనమన్నారు.

మోదీ దేశ ప్రతిష్టను పెంచారు: కిషన్ రెడ్డి

ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. యూసఫ్‌గూడలో జరిగిన రోడ్డు షోలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మోదీ పాలనపై ప్రజలు ఎంతో విశ్వాసం చూపుతున్నారన్నారు. అందుకే ఎక్కడకు వెళ్లినా బీజేపీకి అనూహ్య ఆదరణ వస్తోందన్నారు. బీజేపీలో చేరేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కమలం గుర్తుకు ఓటువేసి మోదీకి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

BJP
G. Kishan Reddy
Lok Sabha Polls
  • Loading...

More Telugu News