Tamilnadu: కొత్త కారుకు గుడిలో పూజలు.. స్టార్ట్ చేయగానే ప్రమాదం.. ఇదిగో వీడియో

tamilnadu man crashes new car after puja in temple

  • తమిళనాడులోని కడలూర్ లో ఘటన
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
  • దీన్ని చూసి సరదా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు

తమిళనాడులోని కడలూర్ లో ఓ వ్యక్తికి కారు కొన్న ఆనందం తొలి రోజే ఆవిరైంది. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారు మొదటి డ్రైవింగ్ లోనే ప్రమాదానికి గురై చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సుధాకర్ అనే డ్రైవర్ ఇటీవల మారుతి కంపెనీకి చెందిన ఈకో మోడల్ కారు కొన్నాడు. పూజల కోసం దాన్ని కడలూర్ లోని ఓ ఆలయానికి తీసుకొచ్చాడు. వాహన పూజలన్నీ పూర్తయ్యాక కారును స్టార్ట్ చేశాడు. అంతే ఒక్కసారిగా అది ముందుకు దూసుకెళ్లింది. ఆలయం ఆవరణలో ఉన్న రెండు మెట్లపై నుంచి ఎగిరిపడి గుడి రాజగోపురం నుంచి బయటకు దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

కారును ఆపేందుకు దాని పక్కనే నిలబడిన వ్యక్తి దాన్ని పట్టుకొని వెళ్లాడినా అది ఆగలేదు సరికదా.. అతన్ని కూడా ఈడ్చుకెళ్లింది. దీంతో మరో వ్యక్తి కూడా కారు వెనకాల పరిగెట్టడం కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ డ్రైవర్ కు ఎలాంటి ప్రమాదం కాలేదు. కారు గుడి బయట ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది.

ఈ వీడియోను ఒకరు ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో దీనిపై సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్ తొలి రోజే ఆఫ్ రోడింగ్ కు ప్రయత్నించాడంటూ ఓ యూజర్ కామెంట్ పోస్ట్ చేశారు. మరొకరేమో మొదటి రోజే కారుకు ఇన్సూరెన్స్ అవసరం ఏర్పడిందంటూ పోస్ట్ చేశారు. మరొకరేమో కారును దేవుడు మరింత దగ్గరగా చూడాలనుకున్నట్లున్నాడంటూ పేర్కొన్నారు.


Tamilnadu
temple
car
crash
puja
cuddalore

More Telugu News