Arvind Kejriwal: అలా అయితే ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేం...కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దు: కోర్టుకు ఈడీ విజ్ఞప్తి

ED objects bail to Arvind Kejriwal

  • కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై రేపు ఉత్తర్వులు
  • కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు
  • ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కేమీ కాదన్న ఈడీ
  • ప్రచారం కోసం ఓ నాయకుడికి బెయిల్ ఇచ్చిన దాఖలాలు లేవని వెల్లడి

ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కేమీ కాదని... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ జారీ అంశంపై సుప్రీంకోర్టు రేపు ఉత్తర్వులు వెలువరించనుంది. అయితే బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించింది. ఈ మేరకు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ ఈరోజు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కేమీ కాదని పేర్కొన్నారు. తమకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికైనా సరే ఆ వెసులుబాటు లభించలేదన్నారు. గతంలో తాము సమన్లు జారీ చేసిన సమయంలోనూ కేజ్రీవాల్ ఇలాంటి కారణాలే చూపించినట్లు పేర్కొన్నారు.

తాము విచారణకు పిలిస్తే ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరు చెప్పి విచారణకు గైర్హాజరయ్యారని తెలిపారు. గత మూడేళ్లలో 123 ఎన్నికలు జరిగాయని, సంవత్సరమంతా ఏదో చోట ఏదో ఎన్నిక జరుగుతూనే ఉంటుందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ప్రచారం కోసమే మధ్యంతర బెయిల్ ఇస్తే ఇక ఏ రాజకీయ నాయకుడినీ అరెస్ట్ చేయలేమని... జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేమని తెలిపారు.

Arvind Kejriwal
ED
Lok Sabha Polls
AAP
  • Loading...

More Telugu News