VD14: విజయ్ దేవరకొండ 14వ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్!

Vijay Devarakonda Special VD 14 Glimpse

  • విజయ్ దేవరకొండ నుంచి 14వ మూవీ
  • బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ 
  • 18వ శతాబ్ద కాలంలో నడిచే కథ 
  • ఐదు భాషల్లో రూపొందుతున్న సినిమా   


విజయ దేవరకొండ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రాల నుంచి మేకర్స్ అప్ డేట్స్ వదులుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన 14వ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను వదిలారు. విజయ్ దేవరకొండ ఒక వైపున గౌతమ్ తిన్ననూరితోను .. మరో వైపున రవికిరణ్ కోలాతోను సినిమాలు చేస్తున్నాడు. ఇక రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నాడు. 

విజయ్ - రాహుల్ కాంబినేషన్లో గతంలో 'టాక్సీవాలా' సినిమా వచ్చింది .. విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో ఇద్దరూ కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చూడగానే ఇది డిఫరెంట్ కంటెంట్ తో కూడిన కథ అనే విషయం అర్థమవుతోంది. 

ఒక యుద్ధవీరుడు గుర్రాన్ని అధిరోహించిన శిల్పం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఈ కథ 1854- 1878 మధ్య కాలంలో జరిగే కథ అని ఈ పోస్టర్ లో పేర్కొన్నారు. 'ది లెజెండ్ కర్స్డ్ ల్యాండ్' అంటూ ఒక్కసారిగా కుతూహలాన్ని పెంచారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ కూడా ప్రయోగాల బాటపట్టినట్టే. 

More Telugu News