Aishwarya Menon: ఐశ్వర్య మీనన్ కి అదృష్టం కలిసొచ్చేనా?

Aishwarya Menon Special

  • 'స్పై'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య మీనన్  
  • కార్తికేయ జోడీగా చేసిన 'భజే వాయు వేగం' 
  • ఈ నెల 31వ తేదీన సినిమా విడుదల
  • హిట్ కొడతామనే నమ్మకంతో ఉన్న బ్యూటీ  


తెలుగు తెరకి ఎప్పటికపుడు కొత్త హీరోయిన్స్ పరిచయమవుతూ వస్తున్నారు. అలా కొంతకాలం క్రితం టాలీవుడ్ ను పలకరించిన కథానాయికగా ఐశ్వర్య మీనన్ కనిపిస్తోంది. 2012లోనే ఓ తమిళ సినిమాతో ఆమె తన కెరియర్ ను మొదలెట్టింది,. నటన పరంగా .. గ్లామర్ పరంగా ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత చాలా తక్కువ గ్యాప్ లోనే మలయాళ .. కన్నడ సినిమాలలో మెరిసింది. 

అలాంటి ఐశ్వర్య మీనన్ 'స్పై' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. నిఖిల్ హీరోగా చేసిన ఈ సినిమాలో, ఆయన జోడీగా ఆమె సందడి చేసింది. అయితే ఈ సినిమా పరాజయం పాలు కావడంతో, ఆమెను గురించి ఆడియన్స్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. కొంత గ్యాప్ తరువాత ఆమె మళ్లీ ఇప్పుడు కార్తికేయ జోడీకట్టింది. 

కార్తికేయ హీరోగా 'భజే వాయు వేగం' సినిమా రూపొందింది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ బిజీ కావొచ్చనే ఉద్దేశంతో ఐశ్వర్య మీనన్ ఉంది. మరి ఆమె ముచ్చటను ఈ సినిమా ఎంతవరకూ నెరవేర్చుతుందో చూడాలి. 

Aishwarya Menon
Karthikeya
Bhaje Vayu Vegam
  • Loading...

More Telugu News