VH: మోదీ చెప్పింది నిజమైతే ఇంకా ఉచిత బియ్యం ఎందుకిస్తున్నారు?: కాంగ్రెస్ నేత వీహెచ్

VH questions about PM Modi comments

  • కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో తాము విఫలమవుతున్నామన్న వీహెచ్
  • మోదీ మూడోసారి గెలిస్తే అదానీ, అంబానీలను మరింత కోటీశ్వరులుగా చేస్తారని మండిపాటు
  • దేశం సమష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలని వ్యాఖ్య

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 లక్షల మందిని పైకి తీసుకువచ్చామని ప్రధాని మోదీ చెబుతున్నారని... అదే నిజమైతే ఇంకా ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నారు? అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో తాము విఫలమవుతున్నామన్నారు. మోదీ పదేళ్లలో ఏం చేశారో చెప్పడానికి ఏమీ లేదన్నారు.

మోదీ మూడోసారి గెలిస్తే అదానీ, అంబానీలను మరింత కోటీశ్వరులుగా చేస్తారు తప్ప పేదలకు చేసేదేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ కులగణన చేపడతామని హామీ ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం వేతనం 400 రూపాయలకు పెంచుతామన్నారు.

VH
Congress
BJP
Lok Sabha Polls
  • Loading...

More Telugu News