Raghunandan Rao: నేను ఎంపీగా గెలవడం ఖాయం... కేసీఆర్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడం తప్పదు: రఘునందన్ రావు

Raghunandan Rao says KCR will go to kCR

  • నేను దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా? అని కౌంటర్
  • పోలీసులతోనే డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్‌కు సిగ్గుండాలన్న బీజేపీ నేత
  • బీఆర్ఎస్‌లో పని చేసిన వందలాది మందికి కేసీఆర్ టిక్కెట్ ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీత

మెదక్ నుంచి తాను ఎంపీగా గెలవడం ఖాయమని... కేసీఆర్‌ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించడం తప్పదని మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ... తాను దుబ్బాకలో ఓడిపోయానని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని... మరి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా? అని ప్రశ్నించారు. పోలీసులతోనే డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ఎన్ని కట్టలు ఇచ్చినందుకు సీటు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ డబ్బులు ఇచ్చి గెలిచారని రాధాకిషన్ రావు చెప్పారని పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను, హరీశ్ రావును కలిపి కొట్టానన్నారు.

సిద్దిపేట జిల్లాలో వందలమంది తనలాంటి వారి జీవితాలను కేసీఆర్ ఆగం చేశారని ఆరోపించారు. మెదక్‌తో కేసీఆర్‌కు ఉన్నది పేగుబంధం అంటూ సెంటిమెంట్ పండించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు తెలంగాణ పౌరుషమే ఉంటే డబ్బులు పంచకుండా గెలిచానని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తారా? అని సవాల్ చేశారు. బీఆర్ఎస్‌లో పని చేసిన నాయకులకు కేసీఆర్ టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. వెంకట్రామి రెడ్డి తమకు బినామి కాదని చెప్పగలరా? అని నిలదీశారు.

Raghunandan Rao
BJP
Lok Sabha Polls
KCR
  • Loading...

More Telugu News